TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు‌... జగన్‌పై బండి సంజయ్ ఫైర్

Published on: Tue Aug 22, 2023 11:19AM

బీజేపీ నేత బండి సంజయ్ ... వైసీపీపై దాడి మొదలెట్టారు.. జగన్ ఈ సారి అధికారంలోకి రావడం అసంభవం అన్నారు.  తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం  బ్రాండ్లు రిలీజ్ చేస్తారా?... అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బండి విరుచుకుపడుతున్నారు. ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బీజేపీని హేళన చేశారు. ఏమైంది?. హేళన చేసిన పార్టీలే నామరూపాల్లేకుండా పోయాయి. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది. కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందనేదని బండి సంజయ్ ఆంటున్నారు.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అనంతపురం జెడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన సృష్టిస్తూ రాకుండా చేస్తున్నారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా?. వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలి. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ. ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా?. నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా?. ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నాడట.మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో. నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారు. పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణనమని బండి సంజయ్ మండిపడుతున్నారు.

ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. మనమధ్య మనస్పర్ధల్లేవ్. అందరం బాగుండాలని అనుకుంటున్నాం. ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. మీరు హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నయ్. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఒక మతానికే కొమ్ముకాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు?. జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు.

ఓటర్ చైతన్య మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్... వైసీపీపై ఈ విధంగా దాడి చేశారు. భవిష్యత్తులో... బండి విమర్శల చక్రాల కింద... వైసీపీ నలగక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.