Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలివుడ్ కి శాపం కానున్న సంజయ్ దత్త్ జైలుశిక్ష
posted on: Mar 22, 2013 12:52PM
.jpg)
బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు, అక్రమ ఆయుధాలు కలిగిఉన్న నేరంలో 5ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ సుప్రీం కోర్టు నిన్న ఇచ్చిన తీర్పుతో బాలివుడ్ లో కలకలం రేగింది. గతంలో ఆయన 18 నెలలు శిక్ష అనుభవించినందున మిగిలిన కాలం 42 నెలలు అంటే మూడున్నర సం.లు జైలులో ఉండక తప్పదు.
గతంలో జైలు జీవితం అనుభవించిన తరువాత ఆయనలో చాలా మంచి మార్పు రావడంతో, బాలివుడ్ లో ఆయన మంచి పేరు సంపాదించుకొని అనేక సినిమాలు కూడా చేస్తున్నారు. ఆ కారణంగానే నేడు ఆయనకీ అందరూ సానుభూతి చూపిస్తున్నారు.
అయితే ఆయన ఇప్పుడు ఏకంగా మూడున్నర సం.లు జైలులో గడపాల్సివస్తే వివిధ స్థాయిల్లో ఉన్నఆయన నటిస్తున్న, నటించబోయే సినిమాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోక తప్పదు. బాలివుడ్ నిర్మాతలు దాదాపు రూ.250 కోట్లు ఆయన సినిమాలపై పెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో అన్నిటికంటే ముందుగా చెప్పుకోవలసింది మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ మొట్ట మొదటిసారిగా హిందీ లో చేస్తున్న ‘జంజీర్’ సినిమా. అందులో సంజయ్ దత్త్ గతంలో ప్రాణ్ చోప్రా చేసిన షేర్ ఖాన్ పాత్రను పోషిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ సినిమా షూటింగు ఇటీవలే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది గనుక, ఆయన జైలుకి వెళ్ళడం వలన తమ సినిమా ఆగిపోయే ప్రమాదం లేదని ఆ సినిమా నిర్మాత అమిత్ మెహరా అన్నారు. దాదాపు రూ.50-60 కోట్ల భారీ వ్యయంతో తెలుగు(తుఫాన్) హిందీ బాషలలో నిర్మిస్తున్నఈ సినిమా గండం గట్టెక్కినప్పటికీ, అందరికీ ఆ అదృష్టం ఉండదు.
సంజయ్ దత్త్ ప్రస్తుతం ‘ఉంగ్లీ’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. పీపీ అగర్వాల్ నిర్మిస్తున్న ‘పోలీస్ గిరి’ అనే మరో సినిమా షూటింగ్ కూడా మధ్యలో ఉంది. రెంటిలో కూడా సంజయ్ దత్త్ చేయవలసిన పోర్షనులో చాల భాగం షూటింగు పూర్తయిందని, ఇప్పుడు మిగిలిన భాగం ఏవిధంగా పూర్తిచేయలో అర్ధం కావట్లేదని నిర్మాతలు అన్నారు.
కోర్టు ఇచ్చిన నాలుగు వారాలలో సంజయ్ దత్త్ తో మిగిలిన భాగం పూర్తిచేయడం అసాద్యం గనుక, ఆయన వేసే రివ్యు పిటిషన్ పై కోర్టు స్పందన చూసిన తరువాత, అర్ధంతరంగా ఆగిపోయిన తమ సినిమాలను పూర్తి చేసేందుకు తామే కోర్టును ఆశ్రయించి ఆయనను తాత్కాలికంగా బెయిలుపై విడుదల చేయవలసిందిగా కోరుతామని వారు అన్నారు.
ఇక ఈ రెండు సినిమాల పరిస్థితి ఈ విధంగా ఉంటే, సంజయ్ దత్త్ ‘పీకే’, మున్నాభాయ్’ అనే మరో రెండు హిందీ సినిమాలకు కూడా ఇటీవలే ఒప్పందాలు చేసుకొన్నారు. ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు, సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ‘మున్నాభాయ్ యమ్బీ బీయస్’ (తెలుగులో శంకర్ దాదా యమ్బీ బీయస్) సినిమాకు మూడో భాగంగా తీయబోయే ఈ సినిమా మరియు ‘పీకే’ రెండూ కూడా ఇక ఇప్పుడు పూర్తిగా ఆగిపోయినట్లే భావించవచ్చును.



.jpg)


