TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సానియాకి ఆశాభోంస్లే మద్దతు!

Published on: Sat Jul 26, 2014 2:37PM

 

సానియా మీర్జాకి మహిళా లోకంలో మద్దతు పెరుగుతోంది. మొన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మద్దతుగా నిలిస్తే, తాజాగా మంచు లక్ష్మి సానియాకి మద్దతు ఇచ్చారు. అలాగే నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ కూడా సానియాకి మద్దతు ప్రకటించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే కూడా ఈ అంశం మీద స్పందిస్తూ సానియాకి మద్దతుగా వ్యాఖ్యానించారు. ‘‘సానియాను అనవసర వివాదాల్లోకి లాగారు. గతంలో నన్ను కూడా ఓ రాజకీయ నాయకుడు జాతి వ్యతిరేక వివాదంలోకి లాగారు. ఇలాంటివి నాకు తమాషాగా అనిపిస్తాయి. సానియాని అనవసరంగా వివాదాల్లోకి లాగరాదు’’ అని ఆశాభోంస్లే ట్విట్ చేశారు.