వరుస విజయాలపై సానియా..
Published on: Mon Feb 1, 2016 4:45PM
.jpg)
పద్మభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పైవిధంగా అన్నారు. అంతేకాదు వరుసగా 36 విజయాలు రావడం కమిట్మెంట్ తోనే సాధ్యమవుతుందని.. డబుల్స్ లో తన పార్టనర్ అయిన మార్టీనా హింగీస్ తో కలిసి ఆడటం ఎంజాయ్ చేస్తానని చెప్పారు. 2016 ఓపెనింగ్ బావుంది.. ఫ్రెంచ్ ఓపెన్ లోనూ టైటిల్ గెలుస్తాం.. రియో ఒలంపిక్స్ లో పతకమే టార్గెట్ అని అన్నారు. ఇంకా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


