TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అదరగొట్టావ్ సానియా...

Published on: Mon Apr 13, 2015 12:19PM

 

మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా నంబర్‌వన్ ర్యాంక్‌ను పొందడంతో ఆమెను అభినందనల వెల్లువ ముంచెత్తుతోంది. పలువురు ప్రముఖులు ట్విట్టర్లో సానియాని అభినందించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ‘‘ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ సొంతం చేసుకొన్నందుకు అభినందనలు’’ ట్వీట్ చేశారు. యువతరానికి సానియా విజయాలు ఆదర్శం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. వివిధ రాష్ట్రాల సీఎంలు అనందిబెన్ పటేల్, దేబేంద్ర ఫడ్నవీస్, మమతాబెనర్జీ, సినీ ప్రముఖులు నాగార్జున, రవీనాటాండన్ సోనూసూద్, సుశాంత్, ఫరాన్ అక్తర్, ఫరాఖాన్, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సచిన్, లియాండర్ పేస్, రాజకీయ ప్రముఖులు కేటీఆర్, దిగ్విజయ్ సింగ్ లతో పాటు మరికొందరు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇంకా అభినందనల ప్రవాహం కొనసాగుతూనే వుంది...