TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిగాచీ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య

Published on: Sun Jul 6, 2025 11:54AM

 

సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో  మృతుల సంఖ్య 41కి చేరింది. 

మరో 11 మంది ఆచూకి లభించలేదు. మరికొందరు ఆసుపత్రిలో చికత్స పొందుతుండగా పలువురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది.పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.