TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ రెడ్డి సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ.. సంగం కేసులో ఏసీబీ పిటిషన్ కొట్టివేత

Published on: Mon Jun 14, 2021 7:35PM

జగన్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకే రోజు రెండు కేసుల్లో వైసీపీ సర్కార్ కు షాక్ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ కేసులో ప్రభుత్వం నియామకాన్ని కొట్టివేయగా... సంగం డెయిరీ కేసులో ఏసీబీకి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీలో సెర్చ్ వారెంట్ రీకాల్ చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ స్పెషల్ కోర్టు కొట్టి వేసింది. సంగం డెయిరీలో ఎలాంటి తనిఖీలు అవసరం లేదని కొట్టివేస్తూ ఏసీబీ స్పెషల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.  సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇక మే 29న సంగం డెయిరీ పాలక వర్గ సమావేశం విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించారు. కర్ఫ్యూ, కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి ఈ సమావేశం నిర్వహించారని పటమట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కిశోర్‌ కుమార్‌ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర, సిరిమల్లెల రాజేంద్రప్రసాద్‌, గోపాలకృష్ణతోపాటు మొత్తం 20 మందిపై కేసు నమోదు అయింది. కాగా, సమావేశంలో తాము 12 మంది మాత్రమే పాల్గొన్నామని సంగం డెయిరీ ప్రతినిధులు చెబుతున్నారు.