TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిరణ్ విభజనను అడ్డుకోలేరు

Published on: Mon Oct 21, 2013 6:51PM

 

Sandeep Dikshit on kiran, Sandeep Dikshit telangana, Sandeep Dikshit, congress, samaikyandhra

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం జవాబు ఇచ్చింది. కిరణ్ విభజనను అడ్డుకోలేరని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ తేల్చిచెప్పారు. రాష్ట్రాల విభజనను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరని, రెండేళ్లపాటు సంప్రదింపులు జరిపిన తరవాతనే తెలంగాణ మీద అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. మంత్రుల బృందం ప్రస్తుతం అన్ని విషయాలు పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా బిల్లును తయారు చేస్తుందని ఆయన తెలిపారు. ఇదే విషయం దిగ్విజయ్ ని అడిగితే ఆయన నవ్వి ఊరుకున్నారు. మొత్తానికి కిరణ్ ఇప్పుడు ఏం చేస్తారు అన్నది వేచిచూడాలి.