TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహారాష్ట్ర ఇసుకను కూడా వదలని ఆంధ్రా సిండికేట్లు

Published on: Fri Apr 27, 2012 11:42AM

రాష్ట్రంలో మద్యం మాఫియా కన్నా ప్రమాదకరంగా తయారైన ఇసుక సిండికేట్లు పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రపై కన్నేశాయి. గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రా, మహారాష్ట్ర సరిహద్దులోని మాజీరానదిలో కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కోళ్ళగొట్టేశారు. మంజీరానదిలో ఇసుక క్వారీలను రాష్ట్రప్రభుత్వం రెండేళ్ళక్రితం నిషేధించింది. అయితే మహారాష్ట్రలో అటువంటి నిషేధం లేకపోవడంతో రాష్ట్రానికి చెందిన ఇసుక సిండికేట్లు అక్కడ వాలిపోయారు. మహారాష్ట్ర అధిఇకారులను లంచాలతో మేనేజ్ చేసి ఇసుకను కొల్లగొట్టారు. ఇది చాలదన్నట్లు ఆంధ్రాప్రాంతంలోని నదీగర్భ ఇసుకను కూడా గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోతున్నారు.

 

 

నదీ పరివాహ ప్రాంతంలో సరిహద్దులు సరిగా లేకపోవడంతో ఇసుక సిండికేట్ల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు నిర్నయిద్దామని రాష్ట్ర అధికారులు కోరుతున్నప్పటికీ మహారాష్ట్ర అధికారులు పట్టించుకోవటం లేదు. మహారాష్ట్ర ఇసుక క్వారీ ద్వారా మన రాష్ట్రానికి అపారంగా నష్టం జరుగుతోంది. అక్రమంగా ఇసుక త్రవ్వటంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. మహారాష్ట్రా క్వారీల నుంచి ప్రధానంగా మన రాష్ట్రంలోకి ఇసుక రవాణా అవుతోంది. క్వారీల వేలం ద్వారా మహారాష్ట్ర కోట్లాది రూపాయలు ఆర్జిస్తుండగా, ఇసుకను రవాణా చేస్తున్నభారీ వాహనాల కారణంగా ఆంధ్రాప్రాంతంలో రహదారులు దెబ్బతింటున్నాయి.