TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణా కలెక్టర్ అంటే కాంగ్రెస్ నేతలకు హడల్

Published on: Mon Apr 9, 2012 4:48PM

కృష్ణాజిల్లా:సహజంగా జిల్లా కలెక్టరు పై ఆ జిల్లాకు చెందిన అధికారపార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు  అభివృద్ధి పనులు లేదా తమ కార్యకర్తల పనులపై ఒత్తిడి తెస్తుంటారు. తమ మాటని వినని కలెక్టరును బదిలీ  చేయించడానికి కూడా వెనుకాడరు. మంత్రులైతే కలెక్టరును ఏకంగా తమ ఇంటికి కూడా పిలిపించుకొంటారు. కృష్ణాజిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. ఈ జిల్లాలో కలెక్టరు అంటే అధికారపార్టీ శాసన సభ్యులు, పార్లమెంటు  సభ్యులకు హడల్. మంత్రి కూడా కలెక్టరు అంటే ఎంతో మర్యాదగా వ్యవహారిస్తారు. ఎఐసిసి రాష్ట్ర ఇన్ ఛార్జి గులామ్  నభీ ఆజాద్ అంటే ముఖ్యమంత్రి, పిసిసి నేత ఎంత అనుకువగా వుంటారో జిల్లాకు చెందిన అధికార పక్ష నేతలు  ప్రస్తుతం కృష్ణాజిల్లా  కలెక్టరుగా రిజ్వీ పట్ల కూడా అంతే అనుకువగా వుంటారు. కలెక్టరు రిజ్వి ఎఐసిసి రాష్ట్ర ఇన్ ఛార్జి  గులామ్ నభీ ఆజాద్ సన్నిహితుడు కావడమే అందుకు కారణం. రాష్ట్రంలోని పరిస్థితులపై ఆజాద్ అధిష్టానానికి  ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎటువంటి నివేదికలు సమర్పిస్తారో నని  రాష్ట్ర నాయకులు భయపడే విధంగానే, తమ  ప్రవర్తనపై కలెక్టరు ఆజాద్ కు ఎటువంటి నివేదిక ఇస్తారోనని కృష్ణాజిల్లా నాయకులు భయపడుతుంటారు. జిల్లాకు  చెందిన నాయకులు వ్యక్తిగతంగా మాట్లాడుకొనే సమయంలో కలెక్టరు అని కాకుండా మనపాలిటి ఎఐసిసి ప్రతినిధి అని  చెప్పుకుంటారని కాంగ్రెస్ నాయకులు గుసగుస లాడుతున్నారు.