సింగంతో సమంత రొమాన్స్
Published on: Sat Nov 16, 2013 2:03PM

సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 20 నుండి ముంబాయిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సూర్యతో కలిసి మొదటిసారిగా సమంత నటించబోతుంది. ఈ చిత్రాన్ని రెడ్ డ్రాగన్ డిజిటల్ కెమెరాతో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వయంగా తన సొంత బ్యానరైన తిరుపతి బ్రదర్స్ బ్యానర్ లో లింగుస్వామి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


