మానసికంగా సిద్ధపడాల్సిందే ... సమంత
Published on: Mon Apr 15, 2013 11:33AM
.png)
ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు చిత్రరంగంలోకి అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం విధితమే. కానీ తాజాగా విడుదలైన జబర్ దస్త్, ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాలు సమంతకు పరాజయాలు రుచి చూపించాయి. పరాజయాలు మీలో ఎలాంటి మార్పు తెచ్చింది? అన్న ప్రశ్నకు సమంత ఈ విధంగా సమాధానం చెప్పింది. ఎవరూ వరుసగా విజయాలు అందిపుచ్చుకోలేరు. ఎంత పెద్ద ప్రవాహానికైనా ఎక్కడో చిన్నపాటి అడ్డుకట్టపడుతుంది. అయినా బాధపడాల్సిన అవసరం లేదు. రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేయాలి విజయాలని అందుకున్నామంటే దాని అర్థం ఇక మనకు భవిష్యత్తులో తిరుగులేదని కాదు, వచ్చే పరాజయాల్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, దానికోసం మానసికంగా సిద్ధపడాల్సిందే అని చెప్పింది.


