TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యుపి ఎన్నికలు:జయప్రద వర్సెస్ ఆజం ఖాన్‌

Published on: Thu Dec 22, 2011 12:19PM

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అమర్ సింగ్ నిర్ణయం మేరకు తెలుగు సినీ నటి,పార్లమెంటు సభ్యురాలు జయప్రద ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆమె రాష్ట్రీయ లోక్‌మంచ్ తరఫున పోటీ చేయనున్నారు. ఆమె రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో తన ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను ఆమె ఎదుర్కోనుంది.చాలా కాలంగా ఆజం ఖాన్‌కు, జయప్రదకు మధ్య వైరం కొనసాగుతోంది. రాంపూర్ నియోజకవర్గం నుంచి 2009 లోకసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఆజం ఖాన్ జయప్రదను వ్యతిరేకించారు. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం కూడా సాగించారు. పైగా, ముంబై ఉగ్రవాద దాడిలో మరణించిన ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సతీమణి కవితా కర్కరేను సమాజ్‌వాదీ పార్టీగా నిలబెట్టేందుకు ఆజం ఖాన్ అప్పట్లో ప్రయత్నాలు చేశారు. ఆజం ఖాన్ వంటి వ్యక్తులు శానససభలోకి ప్రవేశించకుండా చూసేందుకు జయప్రదనను పోటీకి దించాలని అమర్ సింగ్ నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అర్వింద్ సింగ్ చెప్పారు.