పాలకొల్లులో ఆగష్టు 27న సమైక్యాంధ్ర రచయితల, గాయకుల సదస్సు

Publish Date:Aug 19, 2013

Advertisement

 

 

 

పాలకొల్లులో డా. సబితా జూనియర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 27 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు సమైక్యాంధ్ర రచయితల, గాయకుల సదస్సు APNRI, విశాలాంధ్ర మహాసభ వారిచే సంయుక్తంగా నిర్వహించబడుతుందని గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. సదస్సులో పాల్గొనేవారు ఉదయం 6:30కి పాలకొల్లు చేరుకోవాలని తెలిపారు.


ఈ సదస్సులో సమైక్యాంద్ర గీతాల రచన, గానములపై శ్రీ రసరాజు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, తటపర్తి రాజగోపబాలం, సిరాశ్రీ, డా. M.B.D.శ్యామల, ప్రముఖ సంగీత దర్శకులు పాల్గొంటారని వారి నేతృత్వంలో ఈ శిక్షణ శిభిరాలు నిర్వహించబడతాయని పాలకొల్లు సమైక్యాంధ్ర J.A.C కన్వీనర్లు మేడికొండ. శ్రీనివాస్ చౌదర, గండేటి వెంకటేశ్వరరావు,రావూరి.జవహర్ లాల్ నెహ్రు,K.A.J.N. వర్మ, విన్నకోట. వెంకటేశ్వరరావులు ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో కళాకారులు, గాయకులు, నటులు, వివిధ కళారూపాలకు చెందిన కళాకారులు, గేయ రచయితలు ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు.పాలకొల్లు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వద్ద సమైకాంద్ర సదస్సు వాహానాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన వారు శ్రీ మేడికొండ శ్రీనివాసచౌదరి గారిని cell:9848177511 నేరుగా సంప్రదింపవచ్చు. ఈ సదస్సులో పాల్గొనేవారికి సదస్సు నిర్వహించే రోజు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు.