సమైక్యా౦ద్ర జేఏసీ నేతలు అరెస్ట్
Published on: Fri Jan 18, 2013 1:46PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో సమైక్య సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించారు. పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు అక్కడికి చేరుకుని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. తమ సమావేశానికి అనుమతివ్వాలని విద్యార్థి నేతలు పోలీసులను డిమాండ్ చేశారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్యన పెద్ద ఎత్తున వాగ్వివాదం నెలకొంది. సదస్సుకు అనుమతివ్వాలని సమైక్య నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


