TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సమాచార హక్కు కమీషనర్ల నియామకంపై పిల్?

Published on: Fri Feb 17, 2012 1:59PM

హైదరాబాద్;  వివాదాస్పదంగా మారిన సమాచారహక్కు చట్టం కమీషనర్ల నియామకంపై ప్రజా ప్రయోజన వాజ్యం వేయాలని పౌర సమాజ వేదిక సభ్యుడు నిర్ణయించారు. వీరు ఇప్పటికై నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ ఉమెన్ అధ్యక్షుడు బి.రామకృష్టంరాజు నాయకత్వాన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నర్సింహన్ ను తమ తీవ్ర అభ్యంతరాలను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. కమీషనర్ నియామకంలో నియమ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించిందని, అంతేకాకుండా తమ ప్రభుత్వం మొదటి సారిగా సామాజిక న్యాయం కూడా పాటించిందని ముఖ్యమంత్రి తాను కలుసుకున్న పౌరసమాజ వేదిక సభ్యులవద్ద వ్యాఖ్యానించారు. దీనితో వారు కొంత నిరాశతో గవర్నర్ నర్సింహన్ వద్దకు వెళ్ళి మెమోరాండం ఇచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ సభ్యుల వివరాలను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చూచాయగా హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఆయన ముగ్గురి పేర్లను పునఃపరిశీలించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిసింది. ఒకవేళ ఈ ముగ్గురి పేర్లను పునఃపరిశీలించకపోతే జివో విడుదలయిన వెంటనే ప్రజా ప్రయోజక వాజ్యం వేయాలని పౌర సమాజ వేదిక నాయకులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే వారు ప్రముఖ న్యాయవాదులను సంప్రదించి పిటిషన్ తయారుచేసి ఉంచారు. అయితే జివో విడుదలకాకుండా పిల్ వేయడం సాధ్యంకాదు కనుక వారు జివో విడుదలకోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది.