TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐశ్వర్య ఊసెత్తని సల్మాన్

Published on: Thu Mar 12, 2015 11:56AM

 

కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలతో ఎంత పాపులరో, రూమర్లతో కూడా అంతే పాపులర్. మన హీరో ఎప్పుడూ ఎదో ఒక గాసిప్ తో నిరంతరం వార్తల్లో ఉంటూనే ఉంటాడు. లేటెస్ట్ గాసిప్ ఏంటంటారా అక్కడికే వస్తున్నామండీ. సల్మాన్ తొలినాళ్ల ప్రేయసి సంగీతా బిజ్ లానీ... ప్రస్తుత ప్రియురాలు లులియా వంట్యూర్ కలిసి ఒకే పార్టీలో ఎంజాయ్ చేశారట. అదే పార్టీలో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడట. తను తన లైఫ్ లోకి వచ్చిన అందరి ప్రియురాళ్ల గురించి వారితో మాట్లాడాడట కానీ ఒక్క ఐశ్వర్య గురించి మాత్రం ప్రస్తావించలేదట. మిగిలిన అందరితో తాను చాలా సంతోషంగా గడిపానని...వారి సాన్నిహిత్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదించానని చెప్పాడట. అంటే ఐశ్వర్యతో సంతోషంగా గడపలేదా అని బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి.