సురేష్ బాబు ఇంట్లో సల్మాన్ కబుర్లు !
Published on: Tue Dec 25, 2012 12:19PM
.jpg)
దగ్గుబాటి సురేష్ బాబు ఇంటికి ఇటీవల ఓ అనుకోని అతిధి వచ్చారు. ఆ కుటుంబంలో అందరితోనూ కలిసిపోయి డిన్నర్ కూడా చేసాడు. ఆయన ఎవరో కాదు.... బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.
సురేష్ బాబు కుటుంబంతో సల్మాన్ కు మంచి స్నేహం ఉంది. మరీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తో. వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉంటారు. ఈ మధ్య జరిగిన సురేష్ బాబు కుమార్తె పెళ్ళికి సల్మాన్ ను కూడా ఆహ్వానించారు. అయితే, సల్మాన్ ఆ సమయంలో వేరే కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల హాజరుకాలేక పోయారు. సల్మాన్ తన ‘దబాంగ్-2’ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆయన నేరుగా సురేష్ బాబు ఇంటికి వెళ్లారు.
వారిద్దరితో పాటు, అక్కడ రామానాయుడుతో కూడా సరదాగా కబుర్లు చెప్పారు. అక్కడ సల్మాన్ రెండు గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే,తమ మధ్య జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి మాత్రం సురేష్ బాబు నిరాకరించారు.


