TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘ఆమె’కి ఐ లవ్ యూ అని చెప్పాటానికి సల్మాన్ భయపడ్డాడట!

Published on: Tue Jun 6, 2017 11:30AM

 

ప్రతీవాడికీ ఓ వన్ సైడ్ లవ్ స్టోరీ వుంటుంది! ఏ .. నమ్మరా? సర్లెండీ, కొంత మందికి వుండదనుకుందాం! కాని, సల్మాన్ ఖాన్ లాంటి కండల వీరుడికి, బాలీవుడ్ బాక్సాఫీస్ బజ్రంగీ భాయ్ జాన్ కి కూడా వన్ సైడ్ లవ్ వుంటుందా? అయినా సల్లూ ప్రేమిస్తే వద్దనే సుందరి ఎవరుంటారు? అఫ్ కోర్స్, ఇప్పుడైతే సల్మాన్ ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతేసి ఒప్పుకోటానికి లక్షల మంది అమ్మాయిలు క్యూలో వున్నారు కాని… మనోడు 16ఏళ్ల టీనేజ్ లో వున్నప్పుడు అంత సీన్ లేదు కదా? భవిష్యత్ లో ఐష్ మొదలు కత్రీనా వరకూ అందర్నీ ఎడాపెడా డేటింగ్ చేసేసే మొనగాడు అవుతాడని తెలీక ఒకమ్మాయి పట్టించుకోనేలేదట!

 

సల్మాన్ స్వీట్ సిక్స్ టీన్ లో వున్నప్పుడు ఒక బ్యూటీని ప్రేమించాడట! ఆమె బాలీవుడ్ భామైతే కాదుగాని… సల్లూకి మంచి ఫ్రెండ్ అట! కాని, సల్మాన్ కు ధైర్యం చాలక మనసులో మాట చెప్పలేదట. ఆమె కూడా సల్మాన్ ప్రేమ సంగతి తెలిసో, తెలియకో ఖాన్ సాబ్ ని పట్టించుకోలేదట. సల్మాన్ ఫ్రెండ్స్ లోనే ఇద్దరు ముగ్గుర్ని డేట్ కూడా చేసిందట! అప్పుడు మన వన్ సైడ్ లవ్వర్ సల్మాన్ తెగ బాధపడేవాడట! అయినా కూడా నోరు తెరిచి చెప్పనేలేదు! ఫైనల్ గా సల్మాన్నీ, అతడి ఫ్రెండ్స్ ని ఎవ్వర్నీ పెళ్లి చేసుకోని ఆ డ్రీమ్ గాళ్ మరెవర్నో చేసుకుని వెళ్లిపోయిందట!

 

సంగీతా బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా… ఇలా బోలెడు మందితో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ నడిపిన సల్మాన్ తన మొట్ట మొదటి లవ్ కి మాత్రం ప్రపోజ్ కూడా చేయలేకపోయాడు. అయితే , త్వరలో రానున్న తన ట్యూబ్ లైట్ సినిమా కోసం చేస్తోన్న ప్రమోషన్లో భాగంగా, ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్ … ఆమె ఎవరు, పేరేంటి అని మాత్రం చెప్పలేదు! అదీ మంచిదే! పాపం ఆవిడ ఈ పాటికి సల్మాన్ తో సమానంగా యాభై ఏళ్ల వయస్సుకొచ్చీ… మనవళ్లతో ఆడుకుంటూ వుండి వుండవచ్చు! మనోడు అనవసరంగా ఆమె ఎవరో చెప్పేసి ఇబ్బంది పెట్టకూడదు కదా….