TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాక్షిపై కత్తి కట్టిన వీరశివారెడ్డి, రూ. 50లక్షలకు పరువు నష్టం దావా

Published on: Tue Apr 3, 2012 10:51AM

కమలాపురం ఎమ్మెల్యే జి. వీరశివారెడ్డి సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానెల్ పై కత్తి గట్టారు. 2010 నుంచి ఈ రెండు తనపై అనేక నిరాధారఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆరోపించాయి. అందుకే సాక్షి న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ ఛానెల్ పై ప్రొద్దుటూరు కోర్టులో రూ 50లక్షలకు పరువునష్టం దావా వేసినట్లు, అలాగే కమలాపురం కోర్టులో సివిల్, క్రిమినల్ కేసులు పెట్టినట్లు ఆయన చెప్పారు. అనేక తప్పుడు వార్తలు, తనకు సంబంధంలేని వార్తలను తనపై ప్రచురించారని ఆయన వాపోయారు. 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో తన పరువుకు భంగం కలిగేలా, అసహనానికి గురయ్యేటట్లుగావార్తలు వ్రాశారన్నారు. నిజానికి సాక్షి పత్రిక కూడా ఆయనపై కక్ష గట్టినట్లు వార్తలు రాస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. వీర శివారెడ్డి హంతకుడిగా, భూ కబ్జాధారుడిగా, ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరిస్తూ సాక్షిలో వరుస కధనాలు ప్రచురించారు.