TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాక్షి మీడియా గ్రూప్‌ ఖాతాలను తెరిపించండి

Published on: Thu May 10, 2012 8:24AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కంపెనీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను తిరిగి తెరిపించాలని కోరుతూ సాక్షి మీడియా గ్రూప్‌ బుధవారం నాంపల్లిలోని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసులో భాగంగా జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, జననీ ఇన్‌ఫ్రా ఖాతాలను మంగళవారం సిబిఐ స్తంభింపజేసిన విషయం తెలిసిందే. 20వేల మంది ఉద్యోగులతో ముడిపడిన సంస్థ ఖతాలు స్తంభింపజేయడం ద్వారా ఉద్యోగులు జీవించే హక్కును కాలరాసినట్లవుతుందని సాక్షి మీడియా తన పిటిషన్లలో పేర్కొంది. ఖాతాల్లో ఉన్న డబ్బుతో ఆస్తుల మార్పిడి చేయబోమని, ఖాతాలను తారుమారు చేయమని సాక్షి విన్నవించింది. 35 కోట్ల నిర్వహణ ఖర్చు, న్యూస్‌ ప్రింట్‌పై దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని జగతి పబ్లికేషన్స్‌ సంస్థ న్యాయస్థానానికి వివరించింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. అయితే ఈ విషయంపై గురువారం సమాధానం చెబుతా మని సిబిఐ తెలపడంతో కేసు విచారణను న్యాయ స్థానం గురువారం నాటికి వాయిదా వేసింది.