సాక్షి మహారాజన్ కు ఈసీ నోటీసులు..

 


బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆమధ్య కాస్త సైలెంట్ గా ఉన్న సాక్షి మహారాజన్.. ఈనెల 6న మీరట్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని దేశ జనాభా పెరగడంపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ఒక వర్గానికి చెందిన వ్యక్తి.. నలుగురిని పెళ్లిచేసుకుని, 40 మంది పిల్లల్ని కని, మూడుసార్లు విడాకులు తీసుకుంటాడు. ఇకపై ఇలాంటి పద్ధతిని సహించేది లేదు'' అని సాక్షి మహారాజ్‌ అన్నారు. ఇక దీనికి గాను  సాక్షి మహరాజ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చింది. బుధవారంలోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో తామే ఎలాంటి సమాచారం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు.

 

ఇక దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ సాక్షీ మ‌హారాజ్ తాను ఎవరి మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడ‌లేద‌ని అన్నారు. అంతేకాదు త‌న‌కు హిందీలో నోటీసు ఇవ్వాల‌ని.. దేశంలో జ‌నాభా ఆందోళ‌న‌క‌ర రీతిలో పెరిగిపోతున్న‌ట్లు ఎంపీ ఎన్నిక‌ల సంఘం ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తన ప్ర‌సంగ వీడియోల‌ను ఒక‌సారి స‌మీక్షించాల‌ని, ఏ వ‌ర్గానికి చెందిన వాళ్ల‌పై తాను కామెంట్స్ చేయ‌లేద‌ని ఎంపీ సాక్షీ మ‌హారాజ్ అన్నారు.