చంద్రబాబు ఆరోగ్యశ్రీ కి 650 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లారు: సజ్జల

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు కోటి 28 లక్షల ఇళ్లలో సర్వే చేయించినట్టు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జ్వరం,దగ్గు, గొంతు నెప్పి ఉన్నవారిని గుర్తిస్తున్నామన్నారు. వెంటనే డాక్టర్లు వెళ్లి వైద్యపరీక్షలు చేస్తున్నారు.డాక్టర్ల సలహా మేరకు క్వారంటైన్లకు, ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు. జమాత్ కు వెళ్లివచ్చినవారిని గుర్తించాం.వారందరికి వైద్యపరీక్షలు పూర్తిఅయ్యాయని సజ్జల చెప్పారు. వైరస్ సోకిన వాళ్లు స్వఛ్చందంగా వైద్యపరీక్షలకు ముందుకు రావాలని ఆయన సూచించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమనీ, కరోనా వల్ల రాష్ట్రానికి అదనపు ఆర్దిక భారం పడిందని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని సైతం రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కరోనా వంటి విపత్తు నేపధ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. దరిద్రపు గొట్టు, దిక్కుమాలిన వ్యవహారాలు టిడిపి నడుపుతోందన్నారు. చంద్రబాబు ఏ స్దితిలో ఖజానాను జగన్ మోహన్ రెడ్డిగారికి అప్పచెప్పారనేది ప్రపంచానికంతటికి తెలుసుననీ, ఎన్నికలకు ముందు అందరికి పంచేసి ఖాళీ ఖజానాను నూతన ప్రభుత్వానికి అప్పగించారనీ సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు చేయని పనులకు కూడా బిల్లులు ఇస్తామని కమీషన్లు తీసుకుని వాటిని పెండింగ్ లో పెట్టారని సజ్జల ఆరోపించారు.

"చంద్రబాబు అధికారంనుంచి వెళ్తూ అప్పుల భారమే కాకుండా పెండింగ్ బిల్లుల భారం మీద పడేసి వెళ్లారు.ప్రభుత్వాన్ని ఆర్దికంగా దివాళా తీసి వెళ్లారు ,"అని సజ్జల ఆరోపించాఋ. ఇవన్నీ ఇలా ఉంటే  ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిందని టిడిపినేతలు,చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఇలా మాట్లాడటానికి వీరికి ధైర్యం ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు.ఇలా వ్యాఖ్యలు చేయడానికి వారిది నాలుకా తాటిమట్టా, అని ప్రశ్నించారు.

చంద్రబాబు,యనమల లాంటి వారితో కాకుండా ధూళిపాళ్ల నరేంద్ర వంటివారితో ఖజానాకు సంబంధించి ప్రకటన ఇప్పించారు.ఆదాయం బాగున్నా కూడా ఉద్యోగుల వేతనాలు ఆపుతున్నారంటూ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు.వారికి ఇష్టం వచ్చినవారికి,కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు.దీనికి తోడు, వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు.వాటిని వారికి ఉన్న ఎల్లోమీడియా ద్వారా తాటికాయంతఅక్షరాలతో వేసి దుష్ప్రచారం చేస్తున్నారు. " చంద్రబాబు ఆరోగ్యశ్రీ కి 650 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లారు.పవర్ బిల్లులకు 18 వేల కోట్లు పెండింగ్ పెడితే మేం వచ్చాక చెల్లింపులు చేశాం," అని సజ్జల చెప్పుకొచ్చారు. ఉద్యోగసంఘాల నేతలతో చర్చించారు.వారికి పరిస్దితిని వివరించడం జరిగింది.జీతాలు రెండు విడతల గా చెల్లిస్తామని చెప్పారు.వారు సానుకూలంగా స్పందించారు.అది ఉద్యోగుల గొప్పతనం.ఔదార్యం చూపారు.కోతలు పెట్టేఆలోచన  జగన్ కు లేదు.కోతలు, వడపోతలు చంద్రబాబుకే చెల్లిందని సజ్జల అన్నారు.