TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స‌జ్జ‌ల డిఫెండ్ గేమ్‌.. జ‌వ‌దేక‌ర్‌ను వ‌దిలేసి వీర్రాజుపైనే సెటైర్స్‌..

Published on: Wed Dec 29, 2021 3:11PM

జ‌గ‌న్ స‌ర్కారుకు ఖ‌త‌ర్నార్ వార్నింగ్ ఇచ్చారు మాజీ కేంద్ర‌మంత్రి, బీజేపీ జాతీయనేత ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌. ఏపీలో కొంద‌రు నేత‌లు బెయిల్‌పై బ‌య‌ట ఉన్నార‌ని.. వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్య‌లు జ‌గ‌న్‌రెడ్డిని, విజ‌య‌సాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన‌వే అని అంద‌రికీ తెలుసు. వాళ్లిద్ద‌రూ జైలుకెళ్ల‌డం ఖాయ‌మంటూ జ‌వ‌దేక‌ర్ తేల్చి చెప్పారు. ఇక, మ‌రో ఎంపీ సుజ‌నాచౌద‌రి సైతం సంచ‌ల‌న స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఏపీలో ఫైనాన్షియ‌ల్ ఎమ‌ర్జెన్సీ పెడితే.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఖాయమన్నారు. ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందన్నారు. ఇలా.. బీజేపీ జాతీయ నేత‌లు అంతేసి మాట‌లు అంటే.. నేరుగా జ‌గ‌న్‌రెడ్డిని, విజ‌య‌సాయిరెడ్డిని టార్గెట్ చేస్తే.. ఉలిక్కిప‌డిన వైసీపీ.. అంత‌లోనే స‌ర్దుబాటు రాజ‌కీయం స్టార్ట్ చేసింది. 

జ‌గ‌న్ త‌ర‌ఫున ఎప్ప‌టిలానే స‌జ్జ‌ల రంగంలోకి దిగారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన బీజేపీ ప్ర‌జాగ్ర‌హ స‌భ సంచ‌ల‌నాల‌ను సైడ్‌వేస్ చేయ‌డానికి.. జ‌వ‌దేక‌ర్‌, సుజ‌నా కామెంట్ల‌ను వ‌దిలేసి.. సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌పై మాత్ర‌మే స్పందించారు స‌జ్జ‌ల‌. కావాల‌నే.. వీర్రాజు ఇష్యూను చ‌ర్చ‌లో పెట్టి.. అస‌లైన బెయిల్‌, జైల్ టాపిక్‌ను ప‌క్క‌కు త‌ప్పించే ప్ర‌య‌త్న‌మ‌ని ఇట్టే తెలిసిపోతుంద‌ని అంటున్నారు. 

చంద్ర‌బాబు ఎజెండానే బీజేపీ నేత‌ల ఎజెండా అని.. వీర్రాజుకు స్కిప్ట్ రాసిచ్చింది చంద్ర‌బాబేనంటూ రొటీన్ ఆరోప‌ణ‌లు చేశారు స‌జ్జ‌ల‌. క‌ర్నూలులో హైకోర్టు పెడ‌తామ‌న్న సోము కామెంట్ల‌ను త‌మ‌కు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు. ఇలా టీడీపీ-బీజేపీ.. వీర్రాజు-చంద్ర‌బాబు చుట్టూనే స‌జ్జ‌ల ప్రెస్‌మీట్ అంతా న‌డిచింది కానీ.. ఎక్క‌డా ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ చేసిన‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై మాత్రం స్పందించ‌లేదు. అంటే, బీజేపీ జాతీయ నాయ‌క‌త్వానికి వైసీపీ భ‌య‌ప‌డుతున్న‌ట్టేనా? జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని.. త్వ‌ర‌లో జైలుకు వెళ్తార‌ని ప‌రోక్షంగా అంగీక‌రించిన‌ట్టేనా? లేదంటే, ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ చేసిన కామెంట్ల‌ను స‌జ్జ‌ల ఎందుకు ఖండించ‌లేదు? ఎదురుదాడి ఎందుకు చేయ‌లేక‌పోయారు? జ‌గ‌న్ జుట్టు కేంద్ర చేతిలో ఉంద‌నే భ‌య‌మేనా? అంటూ స‌జ్జ‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.