సైనా ఖాతాలో మలేషియన్ ఓపెన్

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను వేసుకుంది. ఇవాళ జరిగిన మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఫైనల్లో సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పవీ చోచువోంగ్‌పై 22-20, 22-20 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతేడాది రియో ఒలింపిక్స్ తరువాత గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సైన తన మునపటి ఫాంను అందుకుని ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. 2011లో జరిగిన ఈ టోర్నీలో సైనా ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఇది సైనా కెరీర్‌లో 23వ టైటిల్.