TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐటమ్‌గర్ల్‌గా సదా

Published on: Thu Sep 5, 2013 9:33AM

 

తేజ స్కూల్‌ నుంచి హీరోయిన్‌గా పరిచయం అయిన ఓ అందాల భామ ఇప్పుడు సరైన అవకాశాలు లేక ఐటమ్‌ సాంగ్స్‌తో అయినా రాణించాలనుకుంటుంది.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది సదా. తొలి సినిమా తొనే భారీ సక్సెస్‌తో పాటు మంచినటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సదా తరువాత వరుస అవకాశాలతో  స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది.

అంతేకాదు విక్రమ్‌ లాంటి స్టార్ హీరోయిన్‌ సరసన, శంకర్‌  డైరెక్షన్‌లో నటించే చాన్స్‌ కూడా కొట్టేసింది ఈ అందాలభామ. కాని ఎంత స్పీడుగా టాప్‌ ప్లేస్‌కు వచ్చిందో అదే స్పీడ్‌లో కిందకు పడిపోయింది. వరుస ఫ్లాప్‌లతో అవకాశాలకు రాక సిల్వర్‌స్క్రీన్‌కు దూరం అయింది. దీంతో ఇప్పుడు ఎలాగై మరోసారి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలనుకుంటుంది సదా.

అందుకే తమిళ్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీలో ఐటమ్‌సాంగ్‌ చేయడానికి రెడీ అయింది. కాని హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి తరువాత ఐటమ్‌ సాంగ్స్‌కు వచ్చిన హీరోయిన్లు ఎవరు ఇంతవరకు సక్సెస్‌ అయిన దాఖలాలు లేకపోవటంతో సదా రికార్డును మారుస్తుందా అనుకుంటున్నారు సినీ వర్గాలు.