విజయవాడకి రాబోతున్న సచిన్!
Published on: Wed Jul 16, 2014 3:27PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విజయవాడకు రాబోతున్నారు. ఆగస్టు 1న సచిన్ విజయవాడకు వస్తారు. ప్రముఖ వ్యాపార సంస్థ విజయవాడలో ఏర్పాటు చేసిన ఒక మాల్ ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ రాబోతున్నారు. అయితే ఈ వార్త ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించి పీవీపీ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.


