TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడలో సచిన్ సందడి

Published on: Fri Aug 1, 2014 12:55PM

 

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ శుక్రవారం నాడు విజయవాడ నగరంలో హడావిడి చేశారు. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన షాపింగ్ మాల్‌ని సచిన్ టెండూల్కర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కథానాయిక అనుష్క కూడా పాల్గొన్నారు. సచిన్, అనుష్కని చూడటానికి పీవీపీ మాల్ దగ్గరకి అభిమానులు భారీగా తరలి వచ్చారు. దాంతో మాల్ పరిసరాలు జనంతో క్రిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, ‘‘సోదరీ సోదరీమణులారా’’ అంటూ తెలుగులో విజయవాడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడ్డం విశేషం.