TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సచిన్: హైదరాబాద్‌లో టీ, టిఫిన్..!!

Published on: Fri Jul 25, 2014 2:15PM

 

సచిన్ హైదరాబాదుకు వచ్చారు. రావడమే కాకుండా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ దగ్గర సందడి చేశారు. ఆయన ప్యారడైజ్ హోటల్‌లో ఫలహారం తిని, చాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ నుండి సచిన్ బయటకు వస్తుండగా.. భారీగా అభిమానులు చేరి అతనితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. సచిన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం నిండిపోయింది. అభిమానులకు సచిన్ అభివాదం తెలిపారు. సచిన్ టెండుల్కర్ ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ప్యారడైజ్ హోటల్లో టిఫిన్ చేసి, టీ తాగిన సచిన్ భారీగా గుమికూడిన అభిమానులతో పాటు, పోలీసులు కూడా తమ సెల్‌ఫోన్‌లలో సచిన్ టెండుల్కర్ చిత్రాన్ని బందించేందుకు పోటీ పడ్డారు.