సచిన్‌ను పొగడటం ఆపండి ; తాలీబన్‌

 

ఇండియన్‌ లెజండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌పై ప్రశంసలను ఇక ఆపేయాలని పాకిస్థాన్‌ నిషేదిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌ ఇ తాలీబన్‌ పాక్‌ మీడియాను హెచ్చరించింది. ఏకె 47 ఆయుధాలతో ముఖానికి ముసుగువేసుకున్న కొందరు వ్యక్తులతో కలిసి తాలిబన్ అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ మాట్లాడిన ఓ వీడియోను తాలిబన్లు మీడియాకు విడుదల చేశారు.

ఒక భారతీయున్ని గురించి పాక్‌ మీడియా ఇంత గొప్పగా పొగడటం దురదృష్టకరం అని షాహిద్‌ వీడియోలో పేర్కొన్నాడు. సచిన్‌ ఎంత గొప్ప ఆటగాడు అయినా అతను భారతీయుడే అని, పాక్‌ ఆటగాళ్లు ఎలా ఆడారన్నది ముఖ్యంగా కాదు వాళ్లు పాకీస్థానీయులు కాబట్టి వాళ్లను పొగడండి అంటూ పాక్‌ మీడియాను హెచ్చరించారు.