సచిన్ టెండూల్కర్ కి జన్మదిన శుభాకాంక్షలు

Publish Date:Apr 24, 2013

 

‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వారు ఒక్కరోజు ముందుగానే కోల్ కోతలో నరేంద్రపూర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమం వారి అద్వర్యంలో నడుస్తున్న అందవిద్యార్దుల ఆశ్రమంలో 10 పౌండ్ల భారీ కేకును 100 మంది అంధ విద్యార్ధుల చేత, కట్ చేయించి సచిన్ జన్మ దిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. అదేవిధంగా మంగళవారం రాత్రి ముంబైలో ముంబై ఇండియన్స్ టీం యజమాని నీత అంభానీ మరియు టెండూల్కర్ భార్య అంజలి సమక్షంలో ఒక భారీ కేక్ కట్ చేసి సచిన్ జన్మ దిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.

 

ఇక ఈ రోజు కోల్ కోతలో ఐపీయల్ మ్యాచ్ లో ఆడనున్నముంబై ఇండియన్స్ టీం మరియు కోల్ కోత నైట్ రైడర్స్ టీము సభ్యులు అందరు కలిసి ఉదయం డ్రెస్సింగ్ రూమ్ లో విదేశాల నుండి తెప్పించిన కోక్ పౌడర్ తో చేయబడిన 40 పౌండ్స్ బరువున్న ఒక భారీ చాక్లెట్ కేక్ సచిన్ చేత కట్ చేయించి ఆయన జన్మ దిన వేడుక ఘనంగా జరుకొన్నారు. దానిపై ఏప్రిల్2, 2011లో వరల్డ్ కప్ లో గెలిచిన సందర్భంగా తీసిన సచిన్ టెండూల్కర్ ఫోటో ముద్రించారు.

 

సచిన్ తన 24సం.ల సుదీర్గ క్రికెట్ చరిత్రలో నెలకొల్పిన రికార్డులను ముచ్చటించుకొంటే అదొక పెద్ద గ్రంధమే అవుతుంది. బ్రియాన్ లారా తరువాత అంతటి రికార్డ్ సాదించిన ఘనత ఒక్క సచిన్ టెండూల్కర్ కే దక్కింది.సచిన్ ఇంతవరకు 463 మ్యచ్చుల్లో ఆడి 18,426 రన్స్ చేసారు. కొద్ది నెలలక్రితం వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల నుండి రిటైర్ అయిన సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచులకే పరిమితమయిపోయారిప్పుడు. సచిన్ ఇప్పుడు తన ముంబై ఇండియన్స్ టీం తరపున మాత్రమే ఐపీయల్ మ్యాచ్ లో ఆడుతున్నారు.

 

భారతదేశానికే గర్వ కారణమయిన సచిన్ టెండూల్కర్ కి ఈ శుభ సందర్భంగా తెలుగు వన్ పరివారం యావత్ రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తోంది.