నిరాశపర్చిన సచిన్ టెండూల్కర్
Publish Date:Nov 15, 2012
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో సచిన్ భారత్ అభిమానులను నిరాశపర్చాడు. రంజీ మ్యాచ్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సచిన్ ఇంగ్లాండ్ పై కూడా సెంచరీ చేస్తాడని అందరు భావించారు. 18 బంతులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 13 పరుగులకే అవుటయ్యాడు. సచిన్‌ది మూడో వికెట్. మొదటి వికెట్ గంభీర్ రూపంలో 134 పరుగుల వద్ద, రెండో వికెట్ సెహ్వాగ్ రూపంలో 224 పరుగుల వద్ద అవుట్ కాగా సచిన్ 250 పరుగుల వద్ద అవుటయ్యాడు.
తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుగా ఆడి సెంచరీ చేశాడు. రెండేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. ఒక సిక్స్, 15 ఫోర్లతో 90 బంతుల్లో సెంచరీ చేశాడు.