సచిన్ పై రేణుకా ఫైర్.. భారతరత్న లైసెన్స్ ఇచ్చిందా?

 

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్  దాదాపు చాలా రోజుల తరువాత రాజ్యసభకు వచ్చిన సంగతి తెలిసిందే. పాపం చాలా రోజుల తరువాత వచ్చినా కూడా ఆయనకు మాత్రం సభలో సరిగ్గా మాట్లాడే అవకాశం రాలేదు.  'రైట్ టు ప్లే అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్పోర్ట్స్' అనే అంశంపై రాజ్యసభలో సచిన్ నిన్న మాట్లాడాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారంటూ రాస్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సచిన్ దాదాపు 10 నిమిషాల పాటు నిలబడే ఉన్నా మాట్లాడే అవకాశం రాలేదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ దిగ్గజ ఆటగాడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ మండిపడ్డారు. ఇక బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన రేణుకా చౌదరి మండిపడ్డారు. 'భారతరత్న' పురస్కారం పార్లమెంట్ లో మీకు మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు.

 

కాగా రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 348 రోజులపాటు సభ జరిగితే... ఆయన కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు.