నేడు మకర జ్యోతి దర్శనం
Published on: Sun Jan 15, 2012 10:11AM
కేరళ :శబరిమల యాత్ర చివరి రోజైన ఆదివారం పొన్నాంబళంమేడు కొండల్లో మకర జ్యోతి భక్తులకు దర్శనమీయనుంది. ఈ దీపారాధనను అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లుచేశారు. గత యేడాది తొక్కిసలాట జరిగి వంద మంది భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఈసారి అలాంటి దుర్ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు వీలుగా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తుల కోసం పులిమేడుతో పాటు పంచలిమేడు,పరుంతుపర ప్రాంతాలను కూడా సిద్ధం చేశారు. రద్దీని నివారించేందుకు బారికేడ్లు నిర్మించారు. పోలీసులు, వైద్యశాఖ, ఆగ్నిమాపక విభాగం పులిమేడులో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. పంచలిమేడు, పరుంతుపరల నుంచి కూడా మకర జ్యోతిని స్పష్టంగా వీక్షించొచ్చని ఇడుక్కి జిల్లా కలెక్టర్ ఈ దేవదాస్ తెలిపారు.


