TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.57 కోట్లు

Published on: Tue May 9, 2023 9:17AM

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం శ్రీవారిని 65, 904 మంది భక్తులు దర్శించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 57లక్షల రూపాయలుగా ఉంది. కాగా సోమవారం 29, 290 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఈ రోజు ఉదయం కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. టోకెల్ లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది.