విమానం కూలి 32 మంది మృతి..

 

రష్యాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ విమానం కూలిపోవడంతో 32 మంది మృతి చెందారు. వివరాల ప్రకారం.. సిరియాలోని హిమిమిమ్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవుతున్న రష్యా రవాణా విమానం సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది, 26 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు.. రష్యా రక్షణ శాఖ అధికారి  వెల్లడించారు. కాగా ఈ ఘటన వెనుక విమానయాన రక్షణ నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అన్న కోణంతో పాటు, ల్యాండింగ్ సమయంలో తేలికపాటి క్షిపణి ప్రయోగం జరిగిందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు.