Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యుద్ధ విరమణ దిశగా ఒక ముందడుగు
posted on: Jul 28, 2022 7:10AM
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో నెలలోకి ప్రవేశించింది. ఆ యుద్ధం ఆ రెండు దేశాలనే కాక ప్రపంచ దేశాలన్నిటినీ ఆర్థిక ఇక్కట్లలోకి నెట్టివేసింది. ఒక విధంగా ఇది యుద్ధం కాదు.. రష్యా దురాక్రమణ అని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నా రష్యా మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. యుద్ధం విరమించాలని రష్యాను ఐరాస సహా పలు దేశాలు కోరాయి. ఒత్తిడి తెచ్చాయి. ఆంక్షలు విధించాయి. ఐదు నెలలుగా ససెమిరా అంటూ వచ్చిన రష్యా ఎట్టకేలకు ఒక మెట్టు దిగింది.
ఉక్రెయిన్ నుంచి గోధుమలు, వంట నూనె వంటి నిత్యావసరాల ఎగుమతికి అంగీకరించింది. రష్యా నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. యుద్ధ విరమణ దిశగా ఇది ఒక ముందడుగుగా అభివర్ణించాయి. ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియెట్ రష్యాలో అంతర్భాగంగా ఉండి, ఆ తరువాత రష్యా అండదండలతో ఆహార, ఇంధన రంగాల్లో ఎదిగిన ఉక్రెయిన్ రష్యా వ్యతిరేక కూటమి అయిన నాటోలో చేరడాన్ని జీర్ణించుకోలేక రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. చిన్న దేశం చిదిమేయవచ్చని భావించిన రష్యాకు ఆ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం మింగుడుపడటం లేదు.
మరో వైపు స్వదేశంలోనూ పుతిన్ పై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధోన్మాదమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఈ నేపథ్యంలోనే రష్యా ఒక మెట్టు దిగి వచ్చి నల్ల సముద్రం మీదుగా నిత్యావసరాల రవాణాకు అనుమతి ఇచ్చింది. అయితే దీనితోనే అంతా అయిపోయిందని భావంచడానికి లేదు.
మొత్తంగా యుద్ధం విరమించి శాంతి వాతావరణం ఏర్పడితేనే ప్రపంచానికి మేలు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అనివార్యంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు వస్తాయన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతున్నది. అన్న వస్త్రాలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇప్పటి వరకూ రష్యాను సమర్థిస్తూ వచ్చిన చైనా వంటి పలు దేశాలు కూడా యుద్ధాన్ని విరమించాలంటూ రష్యాకు సూచనలు చేస్తున్నాయి.


.webp)
.webp)


