గాల్లోనే అదృశ్యమైన విమానం.. పేలిపోయి ఉంటుందన్న అనుమానాలు
Published on: Thu Jul 24, 2025 12:59PM

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 50మంది ప్రయాణికులతో చైనా లోని టిండా నగరం వైపు వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆ విమానం గాల్లోనే పేలిపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది.
రష్యాలోని అంగారా విమానయాన సంస్థకు చెందిన ప్రయాణికుల విమానం 50 మందితో వెడుతూ చైనా సరిహద్దులో గల్లంతైంది. చైనా సరిహద్దు ప్రాంతమైన అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళుతుండగా . గమ్యస్థానానికి కొద్ది దూరంలో అదృశ్యమైంది. విమానం అదృశ్యమైన విషయాన్ని అధికారులు ధృవీకరించారు.


