ఈడీ సోదాలు.. రూ. 2 కోట్లు స్వాధీనం
Published on: Sat Jan 17, 2026 9:02AM
.webp)
ఖనిజాల అక్రమ తవ్వకాల ఆరోపణలపై ఈడీ అధికారులు సోదాలు జరిపి రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక, నల్లరాయి వంటి వాటి అక్రమ తవ్వకాల ద్వారా భారీగా మనీలాండరింగ్ జరుగుతోందన్నఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
గంజాం జిల్లాలో దాదాపు 20 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు దాదాపు రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగదులో పాటు మైనింగ్ లీజులకు సంబంధించి కీలక పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


