రుద్రమదేవి నగల చోరీ.. ఎన్నో అనుమానాలు!
Published on: Tue Jul 22, 2014 10:00AM

రుద్రమదేవి సినిమా కోసం తెచ్చిన కిలోన్నర బరువైన బంగారు నగలు పోయాయని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంతవరకు నగల చోరికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకకపోయినప్పటికీ ఎన్నో అనుమానాలు అయితే పోలీసులకు కలుగుతున్నాయి.
1. అసలు సినిమా షూటింగ్ కోసం బంగారు ఆభరణాలు వాడాలని ఎందుకు అనుకున్నారు?
2. బంగారు ఆభరణాలు, గిల్టు ఆభరణాలు కలిపి ఎందుకు వుంచారు?
3. నిజంగానే పోయిన ఆభరణాలలో బంగారు ఆభరణాలు వున్నాయని ఆధారాలేమిటి?
4. పోయిన ఆభరణాలలో బంగారు ఆభరణాలెన్ని? గిల్టు ఆభరణాలెన్ని?
5. విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిసినా వాటిని అంత అజాగ్రత్తగా ఎందుకు ఉంచారు?


