TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రయాణికులకే కాదు కూరగాయల ధరల పై కూడా ఆర్టీసీ సమ్మే సెగ...

Published on: Mon Oct 7, 2019 11:38AM

అసలే వర్షాలతో తీవ్ర ఇబ్బందుల పడుతున్న రైతులకు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు రానుపోను ఛార్జీలు లెక్కలు వేసి కూరగాయల ధరలను అమ్మే పరిస్థితి ఉందంటూ వాపోయారు రైతులు. ప్రైవేట్ వాహనాల పెంచిన ఛార్జీలతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్టు తెలిపారు. ఆర్టీసీ చేస్తున్న సమ్మె కారణంగా కూరగాయలపై ప్రభావం కనిపిస్తోంది. అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్ కు తీసుకు వచ్చి ఇక్కడ అమ్ముతూంటారు. ఉదయం ఐదు గంటలకే వాళ్లు ఇళ్లలో నుంచి బయలుదేరి మార్కెట్ కి ఏడు గంటల వరకు చేరుకొని అక్కడ సాయంత్రం వరకు కూడా పండించిన కూరగాయలను అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది.

కానీ ఈ రోజు ఉదయం ఆరు గంటలకు బస్టాండ్ కి వస్తే ఎక్కడ కూడా ఒక్క బస్సు లేదు, బయటికి కదలని పరిస్థితుల నేపథ్యంలో మేం ప్రైవేట్ ఏజెన్సీని అలాగే ఆటోలని మేము తీసుకొని రావాల్సి వచ్చింది. దాదాపు ఇరవై నుంచి ముప్పై రూపాయల టిక్కెట్ ఆర్టీసీ బస్సుకు పెట్టుకుంటే దాదాపు యాభై నుంచి వంద రూపాయల వరకు మేము ఆటోకి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు కూరగాయదారులు . ఇలాగే వాళ్ళు వాళ్ళ నిరసనని సమ్మెను కొనసాగిస్తే దాదాపు కూరగాయల రేట్లపై కూడా ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంటుందని వెల్లడించారు.ఇంకా ఎక్కువగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.  మొదటి రోజు ఆర్టీసీ చేస్తున్న సమ్మె కారణంగా ఆటోలు ఒక్కరోజూ రెండ్రోజులు ఉపయోగిస్తారు కానీ ఎక్కువగా పది పదిహేను రోజుల వరకూ ఇది కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కూరగాయల రేట్లు పెంచాల్సిన అవసరమైతే వస్తుంది అని చెప్పి రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం మెహిదీపట్నం మార్కెట్ దగ్గర ఉన్న పరిస్థితి,

ఇక్కడ రంగారెడ్డి జిల్లా అలాగే మేడ్చల్ నుంచి అనేక మంది రైతులు తాము పండించిన కూరగాయాల్ని తీసుకువస్తూ ఉంటారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు తాము  పండించిన కూరగాయలను అమ్ముతూ ఉంటాము. కానీ రాను రాను ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు.