TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్.టి.సి. ఎండి పై బొత్స సీరియస్

Published on: Thu Mar 15, 2012 3:37PM

ఆర్.టి.సి. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు పై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఎ.సి. బస్సులు 1/3 రాయితీ ఇచ్చే విషయంలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేఖంగా వ్యవహరించినందుకు ప్రసాదరావు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోని అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎ.సి.బస్సులు మినహా అన్ని సర్వీసుల్లో 1/3 రాయితీ ఇస్తోంది. కొన్ని జర్నలిస్టు సంఘాల అభ్యర్ధన మేరకు ఈ రాయితీ ఎ.సి. బస్సులకు కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికై ఒక జి.వో.ను కూడా విడుదల చేసింది. అయితే ఈ.జి.వో.కు భిన్నంగా ప్రసాదరావు వ్యవహరించారు. రాయితీల్లో 1/3 ఆర్.టి.సి. ఎం. డి. కి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధాన పరనిర్ణయాలను ఎలా మార్చివేస్తారని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆర్.టి.సి. ఇప్పటికే నష్టాల్లో ఉందని ఇలా రాయితీలు పొడిగించుకుంటూ పోతే సంస్థ మనుగడ కష్టమని ఆయన వివరణ ఇవ్వబోతుండగా బొత్స మరోసారి ఆయనపై మరోసారి విరుచుకుపడ్డారు. సంస్థ ఏ మేరకు రాయితీలు ఇస్తోందో ఆ మేరకు ప్రభుత్వం నిధుల విడుదల చేస్తున్నప్పుడు ఆర్.టి.సి.కి జరిగే నష్టమేమిటని బొత్స ప్రశ్నించడంతో ప్రసాదరావు సైలెంటైపోయారు.