కేసీఆర్ కుల సంఘాలకు కోట్లు.. కార్మికులకు బెదిరింపులు

 

ఆర్టీసీ కార్మికులు సమ్మెకి సిద్దమవడం.. దానికి కేసీఆర్ స్పందన చూసి అందరూ షాక్ అవ్వడం తెల్సిందే.. వేరే సీఎం ఎవరైనా అయితే సమ్మె చేసే వాళ్ళకి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు.. కానీ కేసీఆర్ రూటే సెపరేట్ కదా.. అందుకే ముక్కుసూటిగా మనసులో ఉన్నది చెప్పేసారు.. 'ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది.. మీరిలా సమ్మెలు చేస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి.. అయినా వినకుండా సమ్మెలు చేస్తే టీఎస్ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మె అవుతుంది.

ఆర్టీసీ మూసివేయాల్సి వస్తుంది'..  అని కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.. అయితే కేసీఆర్ స్పందన విని.. ఆర్టీసీ కార్మిక నేతలే కాదు, విపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు.. తాజాగా ఇదే విషయం మీద స్పంచిందిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్. హనుమంతరావు కేసీఆర్ తీరుని తప్పుపట్టారు.. 'అడగకుండానే కుల సంఘాలకు కోట్లిచ్చే కేసీఆర్, కష్టపడి పనిచేసే కార్మికులు జీతం పెంచమని అడిగితే బెదిరించడం ఏంటి' అంటూ వి.హెచ్ ప్రశ్నించారు..మరి ఆర్టీసీ సమ్మె ఇంకెంత దూరం వెళ్తుందో ఏంటో...