TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తృటిలో తప్పిన పెను ప్రమాదం...

Published on: Wed Oct 9, 2019 2:54PM

 

అటు రాష్ట్రమంటా ఆర్టీసీ సమ్మే హడావడి జోరుగా సాగుతున్న నేపధ్యంలో ఏమి జరుతుందా అని అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రమంతటా జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు,వాగులు ఉధృక్తంగా పొంగి పొర్లుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా లో కూడా ఒక పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. ప్రయాణికులు అంతా సురక్షితంగానే ఉన్నరు. నాగర్ కర్నూల్ జిల్లా లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కల్వకుర్తి తెలకపల్లి మార్గం లో బస్సు వాగులో కి దూసుకెళ్లింది. వర్షాల దాటికి జిల్లా లో దుందుబీ వాగు ఉధృతం గా ప్రవహిస్తోంది. రఘుపతిపేట దగ్గర వరద నీరు రోడ్డుపై చేరింది నీటి ప్రవాహ తీవ్రతను గమనించకుండా డ్రైవర్ బస్సు ను వేగంగా నడిపాడు. బస్సు నీటిలో చిక్కు కున్న వెంటనే ఆయన అప్రమత్తమవడం తో ప్రమాదం తప్పింది. ప్రయాణి కులందరూ సురక్షితంగా ఉన్నారు. ఒక్క సారిగా బస్సు వరదలో చిక్కుపోయిన కారణంగా ప్రయాణికులందరూ భయబ్రాంతులకు గురైయ్యారు. డ్రైవర్ కొంత నిదానంగా నడుపుతూ ఉధృక్తిని గమనించి ఉండుంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయ పడ్డారు. అదృష్టం మేరకు ఎటువంటి ప్రమాదం జరగక పోవడమే కాక డ్రైవర్ ఎంతో చాకచక్యంతో   బస్సును  అదుపు చేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.