TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు

Published on: Thu Jun 26, 2025 3:58PM

 

తెలంగాణ వ్యాప్తంగా పలు పలు రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి తదితర జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతుండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

ఆర్టీఏ ఆఫీసులో బ్రోకర్లు పెరిగిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవాణా శాఖ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది.హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌ల పర్యవేక్షణలో అధికారులు కార్యాలయాల్లోని రికార్డులను, కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇద్దరు క్లర్క్‌లతో పాటు కార్యాలయం వద్ద తిష్టవేసిన 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం తలుపులు మూసివేసి, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేసి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.