మారనున్న ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్..


గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) డ్రస్ కోడ్ మార‌నుంది. అయితే ఎప్పటినుండో డ్రస్ కోడ్ మార్పుపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ద‌స‌రా రోజు (అక్టోబర్ 11) నుంచి అమల్లోకి తెస్తున్న‌ట్లు పేర్కొంది.

 

ఇప్పటివరకూ తెల్ల షర్ట్.. ఖాకీ నిక్కర్లతో ఉన్న డ్రస్ వేసుకునే వారు. అయితే సంస్థలో చేరిన కొంత మంది యువకులు.. నిక్క‌ర్లు ధ‌రించ‌డం ప‌ట్ల త‌మ‌పై ప‌లువురు కామెంట్లు చేస్తున్నారని ఆరోపించడంతో నిక్కర్ల స్థానంలో ముదురు గోధుమ వర్ణపు ప్యాంట్లు క‌న‌ప‌డ‌నున్నాయి. కాగా ఇపప్టికే సంఘ్ నాగపూర్ ప్రాంతాల్లో అధికారికంగా కొత్త డ్రస్‌ను విక్ర‌యిస్తోంది. ముదురు గోధుమ వర్ణంలో ఉండే జంట ప్యాంటులను రూ.250లకు అందిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల ఎత్తు దృష్ట్యా ప్యాంటులో మ‌రో రెండు అంగుళాలు పెంచడానికి మరో 10 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు.