కేసీఆర్ మౌనం- కూలీలుగా మార్చే ప్రయత్నం.. గఢీల పాలన నుంచి విముక్తి సమయం!
Published on: Mon Oct 18, 2021 2:24PM
ఓ వర్గం తరఫున పోరాడాతున్నారాయన. దొరల పాలన నుంచి విముక్తి కోరుతున్నారు. పిడికిలి బిగించి.. రాజ్యాధికారం సాధించుకుంటామంటున్నారు. ఏనుగెక్కి ప్రగతిభవన్‌ను ఏలుతామంటున్నారు. ఆయనే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. ప్రభుత్వ విధానాలను, ఓ వర్గానికి జరుగుతున్న అన్యాయాలను నిలదిసి.. నిప్పులతో కడిగేసే.. ఆశాకిరణం అతను. తాజాగా, గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై కేసీఆర్ సర్కారును ట్విట్టర్‌లో నిగ్గదీసి అడిగారు. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే..
"లక్షలాది పేద విద్యార్థులు చదువుతున్న గురుకులాలు & హాస్టళ్లను పునఃప్రారంభించడం పై KCR ప్రభుత్వం యొక్క మౌనం మళ్లీ ఒక తరాన్ని భూస్వాముల భూముల్లో కూలీలుగా-ఇళ్లలో పనిచేసే పనిపిల్లలుగా మార్చే కుట్ర తప్ప మరొకటికాదు. గఢీల పాలననుండి తల్లి తెలంగాణను విముక్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది."


