TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భగీరథ్‌ మేనమామకు సిట్ నోటీసులు ఎలా ఇచ్చారు...ఆర్‌ఎస్పీ ఆగ్రహం

Published on: Wed May 13, 2026 7:16PM

 

నిన్న బండి సంజయ్ కరీంనగర్‌లో ఉన్నారు.. 

కేంద్ర మంత్రికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీజేపీ నేత బండి సంజయ్ కుటుంబాన్ని చుట్టుముట్టిన వివాదంపై బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పోక్సో కేసు విచారణలో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులను మేనమామకు అందించడం ఏ చట్టం ప్రకారం జరిగిందో డీజీపీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో జరిగిన ఏక్తా యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నప్పటికీ, ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు. 

ఐదు రోజులుగా పరారీలో ఉన్న వ్యక్తికి సంబంధించిన నోటీసులను కుటుంబ సభ్యుడికి ఇవ్వడం వెనుక ఉన్న టెక్నికల్, లీగల్ అంశాలపై తాను పలు ప్రశ్నలు లేవనెత్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే రాజకీయంగా వేడెక్కిన ఈ వ్యవహారం నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.