TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్యాంకు దోపిడీ.. 70 లక్షలు...

Published on: Wed Sep 17, 2014 9:46AM

 

ఘజియాబాద్‌ సమీపంలోని దాలునా పట్టణంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చెందిన 70 లక్షల డబ్బును దుండగులు సినిమా ఫక్కీలో దోచుకున్నారు. 60 లక్షల రూపాయల నగదుతో బ్యాంకు దగ్గరకి వచ్చిన వాహనం మీదకి దుండగులు దాడి చేసి వాహనంలోని 60 లక్షలను కాజేశారు. ఆ తర్వాత తీరిగ్గా బ్యాంకులోకి వెళ్ళి సిబ్బందిని, కస్టమర్లని బెదిరించి బ్యాంకులో వున్న 10 లక్షల నగదును కూడా దోచుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయారు. దోపిడీ సందర్భంగా బ్యాంకు ముందు, బ్యాంకు లోపల వున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. బ్యాంకులోని కంప్యూటర్లను కూడా దుండగులు ధ్వంసం చేశారు.