ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు రూ.10వేలు
Published on: Thu Aug 8, 2024 2:40PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం రూ. 10 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలులోనికి తీసుకువచ్చినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వేల దేవాలయాలు నిధులు లేక కనీస ధూప, దీప, పైవేద్యాలకు కూడా నోచుకోకుండా ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబు ఆలయాలకు నిధుల కేటాయింపుపై హామీ ఇచ్చారు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటు దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రభుత్వం రూ. 5వేలు ఇచ్చేది. అయితే జగన్ హయాంలో ఈ పథకం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధకార పగ్గాలు చేపట్టిన రెండు నెలల లోపుగానే గతంలో ఇచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం రూ. 10 వేలు ఇచ్చేందుకు జీవో జారీ చేశారు.


